టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మేజర్’. 26/11/2008న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. తీవ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ.. తాజాగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రధేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ సినిమా చూసి మేజర్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. మేజర్ సినిమా టీమ్ .. యూపీ సీఎం కోసం ప్రత్యేకంగా షో వేసారు. ఈ మూవీ చూసి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భావోద్వేగానికీ గురయ్యారు. దేశం కోసం ప్రాణాలర్పించిన నిజమైన దేశ భక్తుడి జీవితం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటూ మేజర్ సినిమా టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు
మేజర్ టీమ్ ను అభినందించిన యూపీ సీఎం యోగి