Nitish Kumar Reddy Offers Special Pooja In Tirumala: తిరుమల వేంకటేశ్వరుడిని యువ క్రికెటర్ నితీశ్ కుమార్ మంగళవారం ఉదయం నైవేద్య విరామంలో దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సాయంత్రం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వచ్చిన నితీశ్ మంగళవారం ఉదయం స్వామివారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.