YS Sharmila on KCR : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్దం రోజూ తారాస్థాయికి పెరుగుతోంది. ఇక వైఎస్ షర్మిల సైతం టీఆర్ఎస్, కేసీఆర్ మీద చురకలు వేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ చేస్తోన్న పనులు మీద కౌంటర్లు వేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రైతు ధర్మా చేసిన బీఆర్ఎస్ పార్టీ మీద షర్మిల కౌంటర్లు వేశారు.
ఈ రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ.. KCR అంటే కాలువలు, చెరువులు,రిజర్వాయర్‌లు అని చెప్పుకొచ్చాడు. దీనిపై షర్మిల స్పందించారు. KCR అంటే కాలువలు, చెరువులు,రిజర్వాయర్‌లు కాదు చిన్న దొర అని చురకలు అంటించారు. K అంటే "కన్నీళ్లు", C అంటే "చావులు",R అంటే "రోదనలు" అని కొత్త అర్థాన్ని చెప్పారు. ఇక రుణమాఫీకి ఎగనామం, ఉచిత ఎరువులకు పంగనామం అంటూ విమర్శలు గుప్పించారు.
సబ్సిడీ విత్తనాలకు కుచ్చుటోపీ పెట్టిండని ఆరోపించారు. గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు చెప్పి నష్టపరిహారం ఎగ్గొట్టిండని ఘాటుగా స్పందించారు. అప్పులపాలై రైతులు, ఉరికంభం ఎక్కుతున్నా, కల్లాలపైనే గుండెలు ఆగిపోతున్నా, పురుగుల మందు తాగి నురుగలు కక్కి చచ్చిపోతున్నా.. ఇక్కడి దొరకు పంజాబ్, హర్యానా రైతులే కనబడుతారని కౌంటర్లు వేశారు.
భూస్వాములకు లక్షలకు లక్షలు రైతుబంధు ఇచ్చి,కౌలు రైతులను కాటికి పంపుతున్న రాక్షస ప్రభుత్వమిది అని మండిపడ్డారు. 60ఏండ్లకే రైతు బీమాను పరిమితం చేసి,రైతు నుదుట మరణ శాసనం రాస్తున్న దాష్టీక ప్రభుత్వమిదని దుయ్యబట్టారు. భూములకు సాగు నీరు అందక, పంటలకు మద్దతు ధర లేక,పండించిన పంటను కొనే దిక్కులేక రైతులు ఆగమైతున్నా.. దొరగారు గడీ దాటి బయటకు రారు అని విమర్శించారు. రైతులకు భరోసా ఇవ్వని బంధిపోట్ల రాష్ట్ర సమితి కేటుగాళ్లకు రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
YS Sharmila : KCR అంటే కొత్త అర్థం చెప్పింది.. కన్నీళ్లు, చావులు, రోదనలు.. వైఎస్ షర్మిల కౌంటర్లు
తెలంగాణలో టీఆర్ఎస్ నేతల ధర్మా
బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్
కేసీఆర్ మీద షర్మిల కౌంటర్లు