హైదరాబాద్: డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఎన్నికల అధికారి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని తమ ఆదేశాల్లో పేర్కొన్న ఎన్నికల ప్రధానాధికారి.. మద్యం విక్రయించే రెస్టారెంట్స్, స్టార్ హోటళ్లలోని బార్లు, మిలటరీ క్యాంటిన్ తదితర కౌంటర్లలోనూ మద్యం అమ్మకాలు నిలిపివేయాలని స్పష్టంచేశారు.
ఎన్నికలపై, ఓటర్లపై మద్యం ప్రభావం పడకుండా ఉండేందుకే చట్టం ప్రకారమే ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.