Weather forecast Heavy Rain Predictions for coming 3 days imd alerts: దేశంలో రుతుపవనాలు ఇప్పటికే జోరుగా విస్తరించాయి. దీని ప్రభావం వల్ల అనేక ప్రాంతాల్లో కుండపోతగా వానకురుస్తుంది. మరోవైపు.. నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల వద్ద కొనసాగిన ఆవర్తనం ఈరోజు ఉత్తర అంతర్గత కర్ణాటక, పరిసర తెలంగాణ ప్రాంతంలో విస్తరించింది. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి వున్నది. దీని ప్రభావం వల్ల.. నిన్న ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి కోమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి, ఈరోజు ఉత్తర అంతర్గత కర్ణాటక,తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న ఆవర్తనం నుండి కేరళలో వ్యాపించింది.
అదే విధంగా.. అంతర్గత తమిళనాడు మీదుగా కోమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కొనసాగుతున్నది. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఇక తెలంగాణలో విషయానికి వస్తే.. ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం పడుతుందని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో వడగండ్ల వర్షంకూడా పడుతుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీని ప్రభావం వల్ల.. రాగల మూడు రోజుల్లో.. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం వుంది. అవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని అన్నిజిల్లాలలో వర్షాలు కుండపోతగా కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ లో కుండ పోతగా వర్షంకురుస్తుండటంతో జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎక్కడ చూసిన రోడ్లన్ని చెరువుల్లా కన్పిస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైపోయాయి. అనేక ఇళ్లలో బురద నీరుచేరడంతో జనాలు నానా ఇబ్బందుల పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యల గురించి స్పెషల్ గాచెప్పనక్కర్లేదు. ఎక్కడ మ్యాన్ హెల్ ఉందో.. ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గుంతలలో నీళ్లు పేరుకుపోయింది. ముఖ్యంగా ఆఫీసులకు, స్కూళ్లకువెళ్లే వారుతీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో కుండపోతగా కురుస్తున్న వర్షంతో.. జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. అవసరమైతే.. తప్ప బైటకు రావోద్దని టోల్ ఫ్రీ నెంబర్ సైతం ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి