వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట విషాదం కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివాహేతర సంబంధం వివాదమే 9 హత్యలకు కారణమని తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. గోనె సంచుల గోదాం వద్ద బావిలో దొరికిన 9 మృతదేహాల కేసులో నిందితుడు బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ అని పోలీసులు గుర్తించారు. కాల్ డేటా రికార్డింగ్ ద్వారా కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. నేడు నిందితుడిని, అతడికి సహకరించిన వ్యక్తులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ బావిలో 9 ఘటన వివరాలను నేడు (మే 25న) విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు. బంగారం భగభగలు @రూ.49,000
పోలీసుల కథనం ప్రకారం.. ఎండీ మక్సూద్(50) గత 20 ఏళ్ల కిందట పశ్చిమ బెంగాల్ నుంచి కుటుంబంతో పాటు జీవనోపాధి కోసం వరంగల్ వచ్చాడు. ఈ ఫ్యామిలీ మొత్తం వరంగల్ గీసుకొండ మండలం గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో పనిచేస్తుండేది. ఈయన కుమార్తె బుస్ర(20) భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఆమెకు స్థానికంగా ఉండే బిహార్ వ్యక్తి సంజయ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. బుస్రతో సంజయ్ తరచుగా చాటింగ్ చేసేవాడు. వీరి మధ్య చాలా సాన్నిహిత్యం ఏర్పడిందని మక్సూద్ గమనించి సంజయ్‌ని మందలించి, దూరం పెట్టాడు. ఆ బావిలో మొత్తం 9 మృతదేహాలు.. అసలేం జరిగింది?
గతంలోనూ ఓ అమ్మాయితో సంజయ్ తిరిగేవాడు. ఆమె కొన్ని రోజులుగా కనిపించయపోవడంతో మక్సూద్‌కు అనుమానం వచ్చి సంజయ్‌ని తరచుగా ప్రశ్నించేవాడు. ఆమెను బిహార్ పంపించానని సంజయ్ చెప్పిన మాటల్ని మక్సూద్ నమ్మలేదు. ఓ యువతి కనిపంచకపోవడం, కూతురితో సంబంధం పెట్టుకున్నాడని తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడన్న భయం, బుస్ర మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక సంజయ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
బుధవారం మక్సూద్ పెద్ద కొడుకు షాబాజ్ పుట్టినరోజు వేడుకను లక్ష్యంగా చేసుకున్నాడు. తనను పిలవకపోయినా సంజయ్ ఆ పార్టీకి వెళ్లాడు. ప్లాన్ ప్రకారం తనతో తీసుకెళ్లిన నిద్రమాత్రల్ని కూల్‌డ్రింక్‌లో కలిపాడు. అది తాగి ఒక్కొక్కరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. వీరిని గోనె సంచిలో చుట్టి ఆటోలో వచ్చిన మరో వ్యక్తి సాయంతో గురువారం వేకువజామున ఒక్కొక్కరిగా గోదాం వద్ద ఉన్న బావిలో పడేశాడు. హత్య చేసిన రోజు సైతం బుస్రతో సంజయ్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..