Telangana Rains : హైదరాబాద్ పరిసరాల్లో క్లౌడ్ బరస్ట్! 10 గంటల్లో 267 మిల్లిమీటర్ల వర్షం.. జల ప్రళయమేనా?

Telangana Rains : తెలంగాణలో మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తోంది. మేఘానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల్లోనే 200 మిల్లిమీటర్ల వరకు వర్షం కురుస్తోంది. ఫ్లాష్ వరదలు వస్తున్నాయి అధికారులు. హైదరాబాద్ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా కుండపోతగా వర్షం కురిసింది. 

Written by - Srisailam | Last Updated : Jul 23, 2022, 09:45 AM IST
  • తెలంగాణలో కుండపోత
  • హైదరాబాద్ పరిసరాల్లో కుంభవృష్టి
  • మరో మూడు రోజులు వర్షాలు
Telangana Rains : హైదరాబాద్ పరిసరాల్లో క్లౌడ్ బరస్ట్! 10 గంటల్లో 267 మిల్లిమీటర్ల వర్షం.. జల ప్రళయమేనా?

Telangana Rains : తెలంగాణలో మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తోంది. మేఘానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల్లోనే 200 మిల్లిమీటర్ల వరకు వర్షం కురుస్తోంది. ఫ్లాష్ వరదలు వస్తున్నాయి అధికారులు. హైదరాబాద్ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా కుండపోతగా వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో కొన్ని గంటల్లోనే 200 మిల్లిమీటర్లకుపైగా వర్షం కురిసింది. గత 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో ఈ సీజన్ లోనే మొదటిసారి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి

మెదక్ జిల్లా పాల్తూరు లో 26.7 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం నమోదవుగా.. జనగాం జిల్లాలోని దేవరుప్పుల ఏరియాలో 25.5, మెదక్ జిల్లాలోని రాజ్ పల్లి లో 23.7, మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి లో 22.2,సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో 21,మెదక్ జిల్లాలోని శివంపేట్ లో 21.4, మెదక్ జిల్లాలోని ఆర్డిఓ ఆఫీస్ వద్ద 21.3 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యాయి.భద్రాద్రి కొత్తగూడెంలోని కొత్తగూడెం వద్ద 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదవుగా... మెదక్ జిల్లాలోని శివనూరులో 19.8...అదే మెదక్ జిల్లాలోని ఇస్లాంపూర్లో 19.6, జనగాం జిల్లాలోని కోల్కొండలో 19.6, జనగాం జిల్లాలోని వావిలాలలో 19.3, మెదక్ జిల్లాలోని శంకరంపేట లో 19.2, జనగాం జిల్లాలోని వడ్లకొండలో 19సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేటలో 18.6, మహబూబాబాద్ లోని నెలలకుదురులో 17.5, మెదక్ జిల్లాలోని దామరంచలో 17.2.. అదే మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో 17.2, మెదక్ జిల్లాలోని చిప్పలుతుర్తిలో 16.9, మెదక్ జిల్లాలోని సర్దానాలో 16.8 సెంటీమీటర్ల భారీ అతి భారీ వర్షాలు నమోదయ్యాయి 
 

హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కాకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అయ్యాయిచందానగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద 13.9 అతి భారీ వర్షం నమోదవుగా... గాజుల రామారావు లోని జీడిమెట్ల ఏరియాలో 13.9, గాజులరామారంలోని ఉషోదయ కాలనీ పార్క్ వద్ద 13.9, కూకట్పల్లి బాలనగర్ వద్ద 13, గాజులరామారంలోని బిఆర్ అంబేద్కర్ భవన్ వద్ద 12.9, మూసాపేట్ ఏరియాలోని బాలాజీ నగర్ లో 12 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్ జిల్లాలోని రాజేంద్రనగర్ లో 11.7 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదవుగా....రామచంద్రపురం ఏరియాలో డిఈఓ ఆఫీస్ డిసైడ్ సబ్ స్టేషన్ వద్ద ఆర్సీపురం 11.2 ,కూకట్పల్లి హెచ్ఎంటి హిల్స్ వద్ద 11.1, మూసాపేట్ లోని సిబిసిఐడి కాలనీలో 11.1, చందానగర్ లోని మాదాపూర్ వద్ద 10 సెంటీమీటర్లు, కాప్రాలోని మహేశ్వర్ నగర్ వార్డ్ ఆఫీస్ వద్ద 10.6,మల్కాజ్గిరి ఏరియాలోని వివేకానంద పురంలో 10.5, చందానగర్ లోని జెపిఎన్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 10.4, కుబ్బిల్లాపూర్ ఏరియాలో మోడల్ కమ్యూనిటీ హాల్ వద్ద 10 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్ లోని సబ్ స్టేషన్ వద్ద 10 సెంటీమీటర్లు, శేర్లింగంపల్లి కాప్రా మల్కాజ్గిరి సికింద్రాబాద్ కొన్ని ఏరియాలో తొమ్మిది సెంటీమీటర్ల భారీ వర్షం భారీ వర్షం నమోదయింది.  

Also Read: Horoscope Today July 23rd : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఇవాళ ఎదురే ఉండదు.. అన్నింటా దూసుకుపోతారు..

Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News