హైదరాబాద్ : విప్లవ రచయిత వరవర రావు ( Varavara Rao ) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొద్దీ రోజులుగా ముంబై తలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ని ముంబైలోని జేజే ఆసుపత్రికి ( Varavara Rao hospitalized ) తరలించారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ( Mumbai cops ) హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులకు ( Hyderabad cops ) సమాచారం అందించారు. చిక్కడపల్లి పోలీసులు అదే సమాచారాన్ని వరవర రావు కుటుంసభ్యులకు తెలియజేశారు. జేజే ఆసుపత్రిలో వరవర రావుకు ( JJ hospital in Mumbai ) ప్రస్తుతం చికిత్స జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ముంబైకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వరవరరావు కుటుంబ సభ్యుల ప్రయాణం, అనుమతికి సంబంధించిన ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారి కో ఆర్డినేట్ చేస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. ( Read also : వరవర రావు ఉన్న జైలులో కరోనా.. మహారాష్ట్ర సర్కార్‌కు కూతుర్ల లేఖ )
తలోజా జైలులో ( Taloja jail ) ఓ ఖైదీకి కరోనావైరస్ సోకిన నేపథ్యంలో తమ తండ్రి ఆరోగ్యం కూడా బాగాలేనందున ఆయనకు బెయిలు ఇవ్వాలని ఇటీవల వరవర రావు ముగ్గురు కుమార్తెలు కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఆయనకి బెయిల్‌పై కానీ లేదా పెరోల్‌పై కానీ విడుదల చేయాల్సిందిగా కోరుతూ మహారాష్ట్ర గవర్నర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బాంబే హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ కూడా రాశారు. వరవర రావు ఆరోగ్యం బాగా లేదని తెలిసిన ఆయన అభిమానులు, పలువురు సాహితీవేత్తలు, ఉద్యమకారులు ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలోని భీమా కోరేగావ్ వయొలెన్స్ కేసులో ( Bhima Koregaon violence case ) వరవర రావును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.