Breaking News: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన వనమా రాఘవకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఖమ్మం సబ్ జైలుకు తరలించారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావును అరెస్టు చేసిన పోలీసులు కొత్తగూడెం జిల్లా జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు రాఘవకు 14రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అనంతరం అతడిని ఖమ్మం సబ్ జైలుకు తరలించారు.
ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ నుంచి డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా అతడి భార్యను ఆశించినట్టు సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించింది. రాఘవపై ఇప్పటికే 12 కేసులున్నాయని కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook