Kishan Reddy: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అందుకేనా..కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Kishan Reddy: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Aug 22, 2022, 05:57 PM IST
  • షా, ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా చర్చ
  • రాజకీయంగా దుమారం
  • స్పందించిన కిషన్‌రెడ్డి
Kishan Reddy: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అందుకేనా..కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Kishan Reddy: కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ భేటీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇద్దరి మధ్య సినిమా గురించి మాత్రమే చర్చ జరిగిందన్నారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చర్చకు వచ్చిందన్నారు. టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానంపై ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందని తెలిపారు. ఈభేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని స్పష్టం చేశారు.

తెలంగాణకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షాను ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. మునుగోడు బహిరంగసభ అనంతరం హైదరాబాద్‌కు కేంద్రమంత్రి అమిత్ షా చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలోని నోవాటెల్‌లో బస చేశారు. ఈసందర్భంగా ఇరువురి మధ్య భేటీ జరిగింది. ఎన్టీఆర్‌ను అమిత్ షా వద్దకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ను షా పుష్పగుచ్చంతో ఆహ్వానించారు. ఈసందర్భంగా అమిత్ షాను ఎన్టీఆర్ సత్కరించారు.

అనంతరం వీరితోపాటు పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, తరుణ్‌ చుగ్, బండి సంజయ్ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం జరిగింది. ఇందులో 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఏకాంతంగా జరిగిన చర్చల్లో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. ఈక్రమంలో ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఎన్టీఆర్‌ను కేంద్రమంత్రి అమిత్ షా కలిసి ఉంటారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించుకునేందుకు మోదీ, అమిత్ షా ఎన్నో వ్యూహాలు రచిస్తుంటారని..ఇందులో భాగంగా భేటీ జరిగి ఉంటుందని వ్యాఖ్యనిచ్చారు. 

పాన్‌ ఇండియా స్టార్‌గా ఎన్టీఆర్ ఎదుగారని..తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానాలు ఉన్నారని..అందుకే ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు కొడాలి నాని. ఈ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయని..కేవలం సినిమాల కోసమే అంటే తాను నమ్మడం లేదన్నారు. రాజకీయ కారణం లేకపోతే బీజేపీ నేతలు ఎవర్నీ కలవరని చెప్పారు. 

Also read:CPI Narayana: ఆయనో పెద్ద క్రిమినల్..ఎంతో మందిని హత్య చేయించారు..అమిత్ షాపై సీపీఐ నారాయణ ఫైర్..!

Also read:Pawan Kalyan: పరిశ్రమలు పెట్టాలంటే కప్పం కట్టాలా..వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్‌ ధ్వజం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News