Telangana: తెలంగాణలో 12కు చేరిన అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఇండెక్స్, అలర్ట్ జారీ చేసిన వైద్యులు

Telangana: గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండల ప్రభావం విపరీతంగా ఉండనుంది. ఆల్ట్రా వైలెట్ రేడియేషన్ అలర్ట్ జారీ అయింది. అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని సూచనలు చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2022, 07:43 PM IST
Telangana: తెలంగాణలో 12కు చేరిన అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఇండెక్స్, అలర్ట్ జారీ చేసిన వైద్యులు

Telangana: గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండల ప్రభావం విపరీతంగా ఉండనుంది. ఆల్ట్రా వైలెట్ రేడియేషన్ అలర్ట్ జారీ అయింది. అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని సూచనలు చేశారు.

తెలంగాణ, ఏపీలో గత కొద్దిరోజులుగా వడగాల్పులు అధికమయ్యాయి. ఎండలు పీక్స్‌కు చేరి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 41-47 వరకూ ఉంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో అల్ట్రా వైలెట్ రేడియేషన్ హెచ్చరిక జారీ చేస్తున్నారు కొందరు వైద్యులు. తెలంగాణ ప్రాంతంలో అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఇండెక్స్ 12కు చేరడంతో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ వి నాగేశ్వర్  కొన్ని సూచనలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఇండెక్స్ 12కు చేరడం వల్ల సన్ ఎలర్జీ కారణంగా శరీరమంతా విపరీతమైన మంట, దురద, ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ ఎండకు ఎక్స్‌పోజ్ కావద్దంటున్నారు. గత పది రోజులుగా చర్మంపై ఎలర్జీతో బాధపడేవారి సంఖ్య పెరిగిందని..దీనికి కారణం అల్ట్రా వైలెట్ రేడియేషన్ అని స్పష్టం చేశారు. 

ఒకవేళ ఎండలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే..సన్ ప్రొటెక్షన్ క్రీమ్ 60 ఎస్‌పీ‌ఎఫ్ అప్లై చేసుకోమని సూచిస్తున్నారు. లేకపోతే..ఫోటో డెర్మటైటిస్, పోలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్ వంటి ఎలర్జీలు వచ్చే అవకాశముందన్నారు. తలపై తప్పనిసరిగా క్యాప్, సన్ గ్లాసెస్, వదులైన బట్టులు వేసుకోవాలని చెబుతున్నారు. అల్ట్రా వైలెట్ సూర్యకాంతి తాకిన కాస్సేపటికి చర్మం దురద, మంట రావడం, దద్దుర్లు వస్తే..వెంటనే స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరీ ముఖ్యంగా మబ్బులున్నాయి కదా అని బయటికి వెళ్ళవద్దంటున్నారు. మబ్బులచాటు నుంచి సైతం అల్ట్రా వైలెట్ సూర్యకాంతి భూమిని తాకుతుందన్నారు. ఉదయం 11 గంటల్నించి సాయంత్రం 4 గంటల మధ్యన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించవద్దని డాక్టర్ నాగేశ్వర్ హెచ్చరించారు. 

Also readPub Minor Rape Case: వణికిస్తోన్న హైదరాబాద్‌ పబ్‌లు - సంపన్నుల పిల్లల అరాచకాలు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News