TRS White Challenge to Rahul: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన రాజకీయంగా మంటలు రాజేస్తోంది. టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య రాహుల్ పర్యటనపై మాటల యుద్దం నడుస్తోంది. కాంగ్రెస్ అంటేనే రైతుల కష్టాలు, కన్నీళ్లు, కరెంట్ కోతలు, విత్తనాల కొరత గుర్తొస్తాయని... అలాంటప్పుడు రాహుల్ వరంగల్ రైతు సభలో పాల్గొని ఏం చెప్పదలుచుకున్నారని టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పాకే రాష్ట్రంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ మరో అంశాన్ని తెర పైకి తీసుకొచ్చింది. రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ నేతలు 'వైట్ ఛాలెంజ్' విసురుతున్నారు.
రేపు రాహుల్ పర్యటన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని గన్‌పార్క్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో రాహుల్‌కు 'వైట్ ఛాలెంజ్' విసురుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. 'రాహుల్ జీ.. మీరు వైట్ ఛాలెంజ్‌కి సిద్ధమా...?' అని ఫ్లెక్సీలపై ఉండటం గమనించవచ్చు. ఇటీవల లీకైన రాహుల్ నేపాల్ నైట్ క్లబ్ వీడియోలోని ఫోటోలను కూడా ఫ్లెక్సీలపై ముద్రించారు.
రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు 'వైట్ ఛాలెంజ్' విసిరిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో సింగరేణి కాలనీ హత్యాచార ఘటనలో నిందితుడు గంజాయి మత్తులో చిన్నారిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలడంతో రేవంత్ రెడ్డే 'వైట్ ఛాలెంజ్'ను తెరపైకి తీసుకొచ్చారు. రేవంత్ వైట్ ఛాలెంజ్‌కి స్పందించిన కేటీఆర్... తాను వైట్ ఛాలెంజ్‌కి సిద్ధమని... ఎక్కడికైనా వచ్చి తన శాంపిల్స్ ఇస్తానని ప్రకటించారు. అయితే ఇదే ఛాలెంజ్‌కు రాహుల్ సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరారు. కొద్ది రోజులకు ఈ అంశం మరుగునపడిపోయింది.
మళ్లీ ఇన్నాళ్లకు ఈ వైట్ ఛాలెంజ్ అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో లీకవడం... రేపు తెలంగాణలో ఆయన పర్యటన ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు 'వైట్ ఛాలెంజ్' అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. వైట్ ఛాలెంజ్‌కి కేటీఆర్ సిద్ధమని... రాహుల్ సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌కి వైట్ ఛాలెంజ్ విసురుతూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇదే అంశంపై మాట్లాడుతూ... రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్‌కు ఒప్పుకుని తన వెంట్రుకలు ఇస్తారా... లేక రేవంత్ రెడ్డిని వెంట్రుకలా తీసి పడేస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సంధిస్తున్న ఈ 'వైట్ ఛాలెంజ్'పై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..!
As you are visiting Telangana, are you ready for the #WhiteChallenge Shri @RahulGandhi ji ?
Our Minister @KTRTRS ji is ready to take the Challenge, he will come & give his test.
For your information, this White Challenge was initiated by your PCC Cheap Revanth.
Hope u accept ! pic.twitter.com/fwpc6JHooz— krishanKTRS (@krishanKTRS) May 5, 2022
Ahead of #RahulGandhi visit to #Telangana banners were seen in parts of City asking if the #Congress Leader was ready to accept #WhiteChallenge by Minister #KTR. The White Challenge was earlier initiated by TPCC chief #RevanthReddy pic.twitter.com/i0snXVi72T
— Aneri Shah (@tweet_aneri) May 5, 2022
Also Read: Airtel OTT Plans: భారతీ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్ సదుపాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.