TRS Plenary Hyderabad KTR Says Central govt Impliments KCR Schemes: ఈ నెల 25న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాట్లను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గురువారం పరిశీలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తాము తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తమ పార్టీ విధానాలను, పరిపాలనను మెచ్చి ప్రజలు మరోసారి ఆశీర్వదించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ (telangana government) పరిపాలన ఎంతో గొప్పగా సాగుతుందన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వం తన పథకాలు, (schemes) కార్యక్రమాలతో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. దేశంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. రైతుబంధు, (Raitubandhu) మిషన్ భగీరథ (Mission Bhagiratha) పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్‌ను వంటి పథకాలను కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రప్రభుత్వం త్వరలో అమలు చేయబోతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read : Amit Shah warns Pakistan : పాకిస్థాన్‌కు అమిత్ షా గట్టి వార్నింగ్, తోకజాడిస్తే సర్జికల్ స్ట్రైక్స్
ఇక ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ (TRSplenary) ఏర్పాట్లపై కేటీఆర్ మాట్లాడారు. ఈ నెల 25న టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక (TRS state president elections) ఉంటుందని చెప్పారు. ప్లీనరీ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభ ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించామని తెలిపారు. ఆహ్వానం ఉన్నవారే టీఆర్‌ఎస్ ప్లీనరీకి (TRSplenary) రావాలి అని కేటీఆర్ సూచించారు.
Also Read : MAA Elections- Prakash Raj letter : సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అంటూ ప్రకాశ్‌రాజ్ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
KTR in TRS Plenary: తెలంగాణ పథకాల్ని కేంద్రం అమలు చేస్తోంది: కేటీఆర్
ఈ నెల 25న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం
ఏర్పాట్లను పరిశీలించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆహ్వానం ఉన్నవారే సమావేశానికి రావాలి అని కేటీఆర్ సూచన