Balka Suman VS Jagga Reddy : పోశమ్మ గుడిలో పొట్టేలులా జగ్గారెడ్డి! మళ్లీ రెచ్చిపోయిన బాల్క సుమన్..

Balka Suman VS Jagga Reddy :టీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే కిషన్ రెడ్డి ఎక్కడా తిరగలేరని సుమన్ వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్.. బజర్దస్త్ లో కమెడియన్ లా మారిపోయారని ఎద్దేవా చేశారు. సంజయ్ చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. పాపాల యాత్ర అంటూ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 04:49 PM IST

    తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న రాహుల్ టూర్

    బాల్క సుమన్, జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం

    పోశమ్మ గుడిలో పొట్టేలులా జగ్గారెడ్డి - బాల్క సుమన్

Balka Suman VS Jagga Reddy : పోశమ్మ  గుడిలో పొట్టేలులా జగ్గారెడ్డి! మళ్లీ రెచ్చిపోయిన బాల్క సుమన్..

Balka Suman VS Jagga Reddy : తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. మే6న తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ వస్తున్నారు. రాహుల్ సభ కోసం కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యేలా టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. అయితే ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించారు. ఉస్మానియా వీసీ తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్ ఓయూలో అడుగుపెట్టాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కామెంట్ చేయడం మరింత కాక రాజేసింది.

బాల్కసుమన్ కామెంట్లు, టీఆర్ఎస్ సర్కార్ తీరుపై టీపీపీసీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.ఎమ్మెల్యే బాల్క సుమన్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఉస్మానియాలో రాహుల్ గాంధీ టూర్ కు పర్మిషన్ ఇవ్వకుండా వీసీపై గులాబీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.  రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోతే ఏం చేయాలో అదే చేస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను చంపేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. విద్యార్థులను హత్య చేసి.. వాళ్ల డెడ్ బాడీల దగ్గర సూసైడ్ లేఖలు రాసి పెట్టినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రాగానే ఉస్మానియాలో జరిగిన ఘటనలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. తన గడ్డంలోని ఒక వెంట్రుకతో బాల్క సుమన్ సమానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.అధికారం మదంతో విర్రవీగుతున్న బాల్క సుమన్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బచ్చా లీడరైన సుమన్ కు ఎక్కడుందన్నారు.

జగ్గారెడ్డి ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు బాల్క సుమన్. సొంత రాష్ట్రం యూపీలో ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని అసమర్థ నేత రాహుల్ గాంధీ అన్నారు. పోశమ్మ గుడిలో పొట్టేలును కట్టేసినట్టుగా జగ్గారెడ్డి ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం బీజేపీ నేతలు గొడవలకు కుట్రలు చేస్తున్నారని, ఉత్తరాది రౌడీ సంస్కృతిని తెలంగాణలో తీసుకువస్తున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతుంటగా అడ్డుకుని బీజేపీ కార్యకర్తలు చిల్లరగా వ్యవహరించారని బాల్క సుమన్ మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే కిషన్ రెడ్డి ఎక్కడా తిరగలేరని సుమన్ వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్.. బజర్దస్త్ లో కమెడియన్ లా మారిపోయారని ఎద్దేవా చేశారు. సంజయ్ చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. పాపాల యాత్ర అంటూ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

READ ALSO: Rahul Gandhi Meeting: ఓయూలో రాహుల్‌సభ- కీలక నిర్ణయం..!

Jupalli Krishna Rao: టీఆర్ఎస్ లోనే ఉన్నా... కాని..! పార్టీ మార్పుపై మాజీ మంత్రి జూపల్లి క్లారిటీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News