Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంటుందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?

కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్​డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 12:33 PM IST
  • క్రమంగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంటుందా
  • లాక్‌డౌన్‌పై కేటీఆర్ ఏమన్నారంటే
Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంటుందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?

TRS Minister KTR says Lockdown will depend on number of Covid 19 cases in Telangana: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ (Covid 19) మహమ్మారి భారత్‌ (India)లో కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆ మధ్య కాస్త అదుపులో ఉన్న వైరస్.. ఇటీవల పంజా విసురుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. డెల్టా, ఒమిక్రాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతుండడంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నైట్‌ కర్ఫ్యూలు, వీకెండ్‌ లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. 

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు కూడా బయటపడుతున్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ కరోనా నిబంధనలు తప్పితే అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ (Lockdown In Telangana) ఉంటుందా? లేదా? అన్న అనుమానం చాలా మందిలో ఉంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు మంత్రి కేటీఆర్‌ (KTR)ను ప్రశ్నించారు. దాంతో ట్విట్టర్‌లో 'ఆస్క్ కేటీఆర్' కార్యక్రమం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. 

Also Read: Archana Gautam - Congress Ticket: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. మిస్ బికినీకి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్!!

'ఆస్క్ కేటీఆర్' కార్యక్రమంలో లాక్​డౌన్, నైట్‌ కర్ఫ్యూపై కేటీఆర్‌కు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకు రాష్ట్రంలో లాక్​డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయన్నారు. అయితే ప్రస్తుతం కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ లాంటి ఆలోచనలు ప్రభుత్వంకు లేనట్టుగా తెలుస్తోంది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితేనే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేసులు పెరుగుతూ పోతున్నందున సంక్రాంతి హాలీడేస్‌ తర్వాత స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అనే దానిపై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

రాజకీయ, అభివృద్ధి, తదితర అంశాలపై నెటిజన్లు చేసిన ట్వీట్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) స్పందించారు. తమ సుస్థిర, సుపరిపాలనే బీజేపీ (BJP) విద్వేష ప్రచారానికి తమ సమాధానమని కేటీఆర్ అన్నారు. బీజేపీ విషపూరిత అజెండాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని, తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలుసన్నారు. పలు అంశాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా, సమాజ్ వాదీకి మద్దతుగా ప్రచారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

Also Read: PM Modi: అందరికీ భోగి శుభాకాంక్షలు.. ప్రజలందరి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా: మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News