Revanth Reddy Tests Positive For COVID-19: ఇటీవల నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం కరోనా రూపంలో కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారని స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కరోనా లక్షణాలు కనిపించడంతో రేవంత్ రెడ్డి ఇటీవల కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా వచ్చిన ఫలితాలలో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలంగాణ(Telangana) కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లోకి వెళుతున్నట్టు ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులు నుంచి తనను నేరుగా కలిసిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ రేవంత్ సూచించారు.
Also Read: Telangana COVID-19 Cases: తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదు, GHMCలో విజృంభిస్తోన్న కోవిడ్ మహమ్మారి
I have been tested positive for covid and isolated myself on doctor’s advice. Who ever has been in contact from the past few days, please take necessary precautions...
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2021
తెలంగాణలో తాజాగా 412 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది. తెలంగాణ ముఖ్య నేతలలో ఒకరైన రేవంత్ రెడ్డి(Revanth Reddy) సైతం కరోనా బారిన పడ్డారు.
కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60ఏళ్లు పైబడిన అందరికీ, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ అందిస్తోంది. ఏప్రిల్ 1నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని కేంద్రం ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook