Revanth Reddy: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఏది చేసినా యూపీఏ కూటమి విచ్చినానికేనని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇచ్చిన సుపారి ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. ఎన్డీఏను సీఎం కేసీఆర్ గద్దెదించాలనుకుంటే ముందు వారి భాగస్వాములను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మళ్లీ సీఎం అయ్యేందుకు కేసీఆర్..ప్రధాని అయ్యేందుకు మోదీ పరస్పరం సహకరించుకుంటున్నారని విమర్శించారు.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. అధికారం కోసం జరుగుతున్న కుట్రలో సామాన్యులు బలి అవుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సమాజానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. దీనిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు రేవంత్‌రెడ్డి. 50 రోజుల్లో 28 మంది ఉద్యోగులు చనిపోయారన్నారు. తక్షణమే వీఆర్ఏలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు.
మునుగోడు టికెట్‌ను పల్లె రవి, కైలాష్ నేత, చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశించారని రేవంత్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానానికి అందించామన్నారు. చివరకు పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేశారని తెలిపారు. బ్రిటిష్ పాలసీ అయిన విభజించు పాలించు విధానాన్ని బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు మునుగోడు ఉప ఎన్నిక కీలకం కానుందని చెప్పారు రేవంత్.
మునుగోడులో కాంగ్రెస్ గెలుపు కోసం నేతలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టికెట్ దక్కని వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వారి సేవలను గుర్తించి పార్టీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. అధిష్టానం ఇచ్చిన సందేశాన్ని వారికి వివరించామన్నారు. మునుగోడు నాయకుల స్ఫూర్తి ఆదర్శనీయమని రేవంత్‌రెడ్డి తెలిపారు. మునుగోడులో గెలుపు కోసం అంతా కలిసి పనిచేయాలన్నారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ముందుకు వచ్చిన నేతలకు అభినందనలు చెప్పారు.
ఈఏడాది చివర్లో మునుగోడు ఉప ఎన్నిక జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వయి స్రవంతి పేర్లు ఖరారు అయ్యాయి. టీఆర్‌ఎస్ నుంచి ఎవరూ పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు. మరోవైపు పార్టీలన్నీ ప్రచారాన్ని షురూ చేశాయి.
Also read:Junior NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర అభిమానుల హంగామా..!
Also read:Krishnam Raju Death Live Updates: కృష్ణంరాజు కన్నుమూత.. రేపు అంత్యక్రియలు -లైవ్ అప్డేట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి