Telangana Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం, నైరుతి రుతు పవనాల జోరు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా ముసురేసింది. ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న రెండురోజుల్లో అంటే ఇవాళ, రేపు తెలంగాణలోని ఈ జిల్లాలకు అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న శనివారం కూడా రాష్ట్రమంతా మసురుగప్పి విస్తారంగా వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో భారీ నుంచి అతి బారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఇవాళ విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
ఇవాళ, రేపు తెలంగాణలోని నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, ఆసిఫాబాద్, మలుకు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత బారీ వర్షాలు పడనున్నాయి. అందుకే వాతావరణ శాఖ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక అదిలాబాద్, సిరిసిల్ల, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Also read: AP IAS Transfers: ఏపీలో కొనసాగుతున్న ఐఏఎస్ బదిలీలు, మరో 62 మందికి స్థానచలనం పూర్తి జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook