Telangana SSC Results: రేపే తెలంగాణ పదవ తరగతి ఫలితాలు, అందరూ పాస్, గ్రేడింగ్ ఇలా

Telangana SSC Results: తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త. పదవ తరగతి విద్యార్ధుల ఫలితాల ప్రక్రియ పూర్తయింది. రేపు అధికారికంగా పదో తరగతి ఫలితాల్ని విడుదల చేయనున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో విద్యార్ధులందర్నీ ప్రభుత్వం పాస్ చేసేసింది. ఇక గ్రేడ్స్ ఎలాగంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2021, 10:38 AM IST
Telangana SSC Results: రేపే తెలంగాణ పదవ తరగతి ఫలితాలు, అందరూ పాస్, గ్రేడింగ్ ఇలా

Telangana SSC Results: తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త. పదవ తరగతి విద్యార్ధుల ఫలితాల ప్రక్రియ పూర్తయింది. రేపు అధికారికంగా పదో తరగతి ఫలితాల్ని విడుదల చేయనున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో విద్యార్ధులందర్నీ ప్రభుత్వం పాస్ చేసేసింది. ఇక గ్రేడ్స్ ఎలాగంటే..

కరోనా మహమ్మారి (Corona Pandemic) కారణంగా వరుసగా రెండో విద్యా సంవత్సరం పరీక్షల్లేకుండానే గడిచిపోయింది. అది కూడా కీలకమైన పదవ తరగతి విద్యార్ధుల పరీక్షలు. 2020లో కరోనా మొదటి వేవ్ కారణంగా..ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంగా. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కరోనా సంక్రమణను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. దీనికి సంబంధించిన ఫలితాల ప్రక్రియను పూర్తి చేసి..రేపు విడుదల చేయనుంది. రాష్ట్రంలో 5.21 లక్షలమంది పదవ తరగతి (SSC Results) విద్యార్ధులందర్నీ పాస్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే విద్యార్ధులకు గ్రేడ్స్ మాత్రం ఈసారి ఇవ్వనున్నారు. అదికూడా ఫార్మేటివ్ అస్సెస్‌మెంట్-1లో వచ్చిన మార్కుల్ని ఆధారం చేసుకుని గ్రేడ్స్ కేటాయించనుంది.

ప్రతి సబ్జెక్టులో ఎఫ్ఏ-1లో నిర్ణీత 20 శాతం మార్కుల ప్రకారం ప్రతి విద్యార్ధి సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఉంటుంది. ఎప్ఏ-1 పరీక్షలకు 5.21 లక్షలమంది విద్యార్దులు హాజరైనట్టు గుర్తించిన విద్యాశాఖ ..ఆ పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని ఐదింతలు చేసి గ్రేడ్స్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్ధులకు ఒక్కో సబ్జెక్టులో వచ్చిన మార్కుల్ని బట్టి గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇవ్వనున్నారు. చివరిగా యావరేజ్ జీపీఏ లెక్కగడతారు. ఈ ప్రక్రియ కారణంగా ఈసారి తెలంగాణ వ్యాప్తంగా 2.2 లక్షలమంది విద్యార్ధులకు 10కి 10 జీపీఏ వచ్చినట్టు తెలుస్తోంది. 

Also read: Global e-Tenders: కోవిడ్ వ్యాక్సిన్లకై గ్లోబల్ టెండర్లు పిలిచిన తెలంగాణ ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News