TS SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్... పరీక్షల షెడ్యూల్‌పై ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం!

TS SSC Exams: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్... పరీక్షల షెడ్యూల్‌పై ఎస్‌ఎస్‌సీ బోర్డు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 11:22 AM IST
  • ఎస్ఎస్‌సీ పరీక్షల నిర్వహణపై బోర్డు నిర్ణయం
  • మే నెలలో పరీక్షలు నిర్వహించే ఛాన్స్
  • కసరత్తులు ప్రారంభించిన ఎస్‌ఎస్‌సీ బోర్డు
TS SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్... పరీక్షల షెడ్యూల్‌పై ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం!

TS SSC Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఎస్ఎస్‌సీ బోర్డు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మే నెలలో పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించగా.. త్వరలో  పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

గత రెండేళ్లు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు నిర్వహిస్తారా నిర్వహించరా అన్న సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణకే బోర్డు మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణ తేదీపై సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా క్లాసులు సరిగా జరగకపోవడంతో ఈసారి పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్ ఇచ్చే అంశాన్ని ఎస్‌ఎస్‌సీ బోర్డు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ రావొచ్చు. ఈ ఏడాది దాదాపు 5.20 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నట్లు అంచనా వేస్తున్నారు. మార్చి మొదటివారంలో పరీక్షా కేంద్రాల ఎంపికకు చర్యలు చేపట్టనున్నారు.

ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 21 నుంచి మే5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. 

Also Read: విషాదం.. మరో మూడు గంటల్లో పెళ్లి... ఇంతలో వరుడి మృతి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News