TS secretariat: సచివాలయంలో మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్

Telangana secretariat | హైదరాబాద్: తెలంగాణ సెక్రెటేరియట్‌లో మరో ఉద్యోగికి కరోనావైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఎన్ఐసి నుంచి డెప్యుటేషన్‌పై వచ్చి ఐటి శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగినికి కరోనావైరస్ పరీక్షల్లో (COVID-19 tests) పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

Last Updated : Jun 14, 2020, 03:31 PM IST
TS secretariat: సచివాలయంలో మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్

Telangana secretariat | హైదరాబాద్: తెలంగాణ సెక్రెటేరియట్‌లో మరో ఉద్యోగికి కరోనా వైరస్ ( Coronavirus) సోకినట్టు అధికారులు గుర్తించారు. ఎన్ఐసి నుంచి డెప్యుటేషన్‌పై వచ్చి ఐటి శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగినికి కరోనావైరస్ పరీక్షల్లో (COVID-19 tests) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో గత ఐదు రోజులుగా ఆమె విధులకు సెలవు పెట్టి నేచర్ క్యూర్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆ ఉద్యోగిని పనిచేస్తోన్న ఐటి విభాగం కార్యాలయం ఉన్న రెండో అంతస్తులో వైరస్ ఇతరులకు వ్యాపించకుండా నివారించడం కోసం సోమవారం డిస్‌ఇన్‌ఫెక్టెంట్ క్లీనర్స్‌తో శానిటైజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

బిఆర్‌కెఆర్ భవన్ (BRKR Bhavan) వేదికగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో కరోనావైరస్ కలకలకం సృష్టించడం ఇదేం తొలిసారి కాదు. వారం రోజుల క్రితం కూడా 8వ అంతస్తులో ఉన్న ఓ కార్యాలయంలో ఆఫీస్ అటెండర్, ఆఫీస్ బాయ్‌కి కరోనా సోకినట్టు తేలడంతో అక్కడి పరిసరాలను తాత్కాలికంగా మూసేసి శానిటైజ్ చేసినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News