తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో విజృంభిస్తోంది. కరోనా కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గత నెల వరకు వందల్లో వచ్చే కరోనా పాజిటివ్ కేసులు, ఏప్రిల్ నెలలో రోజుకూ 3 వేల పైగా నిర్ధారణ అవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 3,840 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,21,880 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా... అందులో 3 వేల 8 వందల నలభై మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 41 వేల 8 వందల 85కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ రాష్ట్రంలో మరో తొమ్మిది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,797కి చేరింది. గత నెలలో ప్రతిరోజూ రెండు, మూడు కరోనా మరణాలు నమోదయ్యేవి. తాజాగా ప్రతిరోజూ ఏడు, ఎనిమిది మందిని కరోనా వైరస్ బలిగొంటుంది.
Also Read: Telangana మాజీ మంత్రి Azmeera Chandulal కన్నుమూత, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కోవిడ్19 నిబంధనలు కఠినతరం చేసింది. మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. గురువారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19 నుంచి 1198 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,09,594 మంది కరోనా మహమ్మారిని జయించారు.
తెలంగాణలో అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో 505 కరోనా కేసులు నిర్ధారణ కావడం హైదరాబాద్ నగర వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 30 వేల 494 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం క్వారంటైన్‌లో 20,215 మంది చికిత్స పొందుతున్నారు.
Also Read: Telangana: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook