Coronavirus: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. రెండు మూడు రోజులనుంచి కేసులు తక్కువగానే నమోదైనప్పటికీ నేడు మరలా కేసులు పెరిగాయి. తెలంగాణ ( Telangana ) వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24గంటల్లో రాష్ట్రంలో 1,550 కేసులు నమోదు కాగా.. 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 36,221కి పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 365మంది బాధితులు కరోనాతో మరణించారు. Also read: Doctor on Tractor: కరోనా రోగి మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లిన డాక్టర్
ఈ రోజు 1,197 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 23,679 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 12,178 మంది పలు హాస్పటళ్లల్లో చికిత్స పొందుతున్నారు. గత 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,525 మందికి పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 1,81,849కి చేరింది. Also read: Heavy rain: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
ఈ రోజు నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 926 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్ జిల్లాలో 53 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.