Telangana Alert: తెలంగాణకు మళ్లీ వర్షం ముప్పు, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Alert: తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ప్రజానీకం ఆందోళన చెందుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 3, 2023, 12:53 AM IST
Telangana Alert: తెలంగాణకు మళ్లీ వర్షం ముప్పు, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటడం, రుతు పవనాలు బలపడటంతో తెలంగాణకు మరోసారి వర్షాలు హెచ్చరిక జారీ అయింది. వచ్చే రెండ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.

తెలంగాణలో మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన పరిస్థితులు, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో సైతం తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. ఆగస్టు 3, 4 తేదీల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్  జారీ చేసింది. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.  భారీ వర్షాల కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా పంటనష్టం ఏర్పడింది. వేలాది కుటుంబాలు నిరాశ్రయులై రోడ్డున పడ్డాయి. ఇప్పుడు మరోసారి వర్షాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

Alo Read: Tamilisai Soundararajan: వరంగల్ జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News