Rains In Telangana: తెలంగాణలో గత రెండు రోజులుగా వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షాలు కురవడంతో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించింది. తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దాంతో ఎండల నుంచి కాస్త ఊరట లభించనుంది.
అల్పపీడన ద్రోణి ఏర్పడింది. తద్వారా కొన్ని జిల్లాల్లో దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ అక్కడక్కడా వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి తెలంగాణ(Telangana)లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఉమ్మండి నల్గొండ, ఉమ్మండి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
Also Read: COVID-19 Positive Cases: తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా, తాజాగా 3 వేల పైగా పాజిటివ్ కేసులు
అసలే కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుంటే తెలంగాణకు మరోవైపు వర్షపు ముప్పు పొంచి ఉంది. వర్షాల అనంతరం వాతావరణ మార్పులతో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరం లాంటి స్వల్ప అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని అర్హులైనవారు కోవిడ్19(Covid-19) టీకాలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా, నిన్న ఒక్కరోజులో రాష్ట్రంలో 3000 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు వ్యక్తులు కరోనా బారిన పడి చనిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook