ఎమ్మార్వోలే సబ్ రిజిస్ట్రార్‌లు

ఎమ్మార్వోలకు రిజిస్ట్రేషన్ల సేవలను ప్రారంభించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం తొలి దశలో 21 మండలాలను ఎంపిక చేసింది.

Last Updated : May 16, 2018, 09:33 AM IST
ఎమ్మార్వోలే సబ్ రిజిస్ట్రార్‌లు

హైదరాబాద్: ఎమ్మార్వోలకు రిజిస్ట్రేషన్ల సేవలను ప్రారంభించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం తొలి దశలో 21 మండలాలను ఎంపిక చేసింది. ఈ మేరకు పాత సబ్ రిజిస్ట్రారులకు కేంద్రం పరిధి నుంచి ఆయా మండలాలను తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం ఆయా మండలాల ఎమ్మార్వోలకు రిజిస్ట్రేషన్ల అధికారులు కల్పించింది. ఈ నెల 19 నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన ఉప జిల్లాలతోపాటు, హెడ్‌ క్వార్టర్లలో వారి కార్యాలయాలే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుగా పనిచేయనున్నాయి. తహశీల్దార్‌ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్‌ సర్వీసులను ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అనువుగా మండలాలు, గ్రామాల విభజనను మారుస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త సబ్‌ జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయనుంది.

ఆదిలాబాద్‌ జిల్లాలోని గుడిహత్నూర్‌, నెన్నేల్‌, నిర్మల్‌ రూరల్‌లను, కరీంనగర్‌ జిల్లాలో మానకొండర్‌, రాయికల్‌, ఇల్లంతకుంట, అంతర్గాన్‌, ఖమ్మం జిల్లాలోని ముదిగొండ, నల్గొండ జిల్లాలోని కట్టంగూర్‌, చివ్వెంల, తుర్కపల్లి, నిజామాబాద్‌ జిల్లాలో బాల్కొండ, సదాశి వనగర్‌, మహబూబ్‌నగర్‌లో దేవరకద్ర, ఐజ, పెబ్బేరు, బిజినేపల్లి, మెదక్‌లో జగదేవ్‌పూర్‌, వరంగల్‌లో మొగుళ్లపల్లి, రంగారెడ్డిలో నవాబ్‌పేటలనే కొత్త సబ్‌ జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

Trending News