Telangana Govt: రేపు హైదరాబాద్‌లో అందుబాటులోకి 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు..ఎక్కడెక్కడంటే..!

Telangana Govt: పచ్చదనానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హరితహారం పేరుతో అద్భుత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రేపు హైదరాబాద్‌లో మరో ప్రొగ్రామ్‌ జరగనుంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 27, 2022, 04:44 PM IST
  • పచ్చదనానికి ప్రభుత్వం పెద్దపీట
  • అందుబాటులోకి 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు
  • రేపే శ్రీకారం
Telangana Govt: రేపు హైదరాబాద్‌లో అందుబాటులోకి 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు..ఎక్కడెక్కడంటే..!

Telangana Govt: హైదరాబాద్‌లో మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. 

నగరవాసులకు మానసిక ఉల్లాసంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 

హైదరాబాద్‌లో ఉన్నత జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీటిని ఔటర్ రింగ్ రోడ్డు, చుట్టు పక్కల సమీపంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశారు. 

రేపు ఉదయం 9 గంటలకు నాగారం, 10.35 గంటలకు పల్లెగడ్డ, 11 గంటలకు సిరిగిరిపూర్, 11.30 గంటలకు శ్రీనగర్, మధ్యాహ్నం 12 గంటలకు తుమ్మలూర్, 12.40 గంటలకు మన్యం కంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లను ప్రారంభించనున్నారు. 

Also read:AP Govt: ఇక అవినీతిపై ఉక్కుపాదమే..సరికొత్త యాప్‌ తీసుకొచ్చిన ఏపీ సర్కార్..!

Also read:Monkeypox: తెలంగాణలో మంకీపాక్స్‌ టెర్రర్..తాజాగా మరో అనుమానిత కేసు నమోదు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News