ముదురుతున్న ''మహర్షి'' టికెట్ల పెంపు వివాదం; ప్రేక్షకుడిపై భారం పడితే ఖబర్దార్ అంటున్న మంత్రి 

రేపు విడుదల కానున్న మహర్షి మూవీ టికెట్ల పెంపు వ్యహారంపై వివాదం ముదురుతోంది

Last Updated : May 8, 2019, 03:08 PM IST
ముదురుతున్న ''మహర్షి'' టికెట్ల పెంపు వివాదం; ప్రేక్షకుడిపై భారం పడితే ఖబర్దార్ అంటున్న మంత్రి 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ''మహర్షి'' మూవీ రేపు విడుదలకు సిద్ధమైన తరుణంలో టికెట్ల పెంపు వివాదం ముదురుతోంది. వేసవి సెలవుల సీజన్ కావడంతో రెగ్యులర్ ఆడియన్స్, అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తారనే అంచనా ఉన్నాయి. అందుకు తగిన విధంగానే గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు.

బెంబేలెత్తిపోతున్న ప్రేక్షకులు

మార్కెట్ లో డిమాండ్ ఏర్పడంతో  థియేటర్లు, మల్టిప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ల ధరలను అమాంతం పేంచేసినట్లు టాక్. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ. 80 నుంచి రూ. 110, మల్టిఫ్లెక్స్ థియేటర్లలో రూ.138 నుండి రూ. 200కు ధరలు పెంచినట్లు రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది..

మంత్రి తలసాని ఆగ్రహం...
తెలంగాణలో మహర్షి మూవీ టికెట్ల పెంపు వ్యహారంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సినీటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కన్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.  ప్రభుత్వాన్ని సంద్రించకుండా మూవీ టికెట్ల ధరలు పెంచితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ధియోటర్ యాజమాన్యాలకు మంత్రి తలసాని హెచ్చరించారు. 

Trending News