Ktr On Nupur Sharma: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మంలో పర్యటించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఖమ్మం లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర పురోగతిని వివరించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శమన్నారు కేటీఆర్. పేదలకు కావాల్సిన పనులను ఎర్రజెండా అవసరం లేకుండానే మంత్రి అజయ్ అందిస్తున్నారని చెప్పారు. అజయ్ చేస్తున్న అభివృద్ధి పనులను కొన్ని శక్తులు అడ్డుకోవాలని చూశాయని ఆరోపించారు.
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించిన కేటీఆర్.. ముస్లింలు ఎందుకు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారో ప్రజలు ఒకసారి ఆలోచించాలని అన్నారు. దేశంలోని 24 కోట్ల మైనార్టీలు ఎందుకు అభద్రతా భావంతో ఉంటున్నారో గమనించాలన్నారు. కులం, మతం పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మోడీ పాలనలో దేశం ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. దేవుడి పేరుతో బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని అడిగితే.. రాష్ట్ర బీజేపీ నేతలు మసీదులు తవ్వుతామని అంటున్నారని విమర్శించారు. తెలంగాణ మీద బండి సంజయ్ కు ప్రేమ ఉంటే మసీదులు కూల్చడం కాదు.. బీడు భూములు సాగులోకి తీసుకొని రావాలని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఒక లీడర్ కులం పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని పరోక్షంగా రేవంత్ ను టార్గెట్ చేశారు కేటీఆర్. కుల, మత పిచ్చోళ్లను తెలంగాణ నుంచి తరిమేద్దామని పిలుపిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెల్లించిన పన్నులతో దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుటున్నాయని కేటీఆర్ చెప్పారు. మనము ఇచ్చిన నిధులతో ఎదో చేశామని చెబుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రనికి జరుగుతున్న అన్యాయాన్ని ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు స్పష్టించినా తెలంగాణను ప్రగతి పథంలో తీసుకునిపోతున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనో ప్రజలకు తెలుసన్నారు. ఒక్కడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లని కామెంట్ చేశారు. కొందరు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు..50 ఏళ్ల పాటు పరిపాలనా చేసి కరెంట్ ఇవ్వని వారు, నీళ్ళు ఇవ్వని వాళ్లు.. ఇప్పుడు ఏమి చేస్తారని ప్రశ్నించారు. 50 ఏళ్లు ఏమి చెయ్యని దద్దమ్మలు ఇప్పుడు చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
Read also: Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వాళ్లకే టికెట్లు... రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
Read also: KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక జగన్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి