Minister Ktr: ఇవాళ యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ పుట్టిన రోజు..ప్రత్యేక కథనం..!

Minister Ktr: తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ పేరు తెలియని వారు ఉండరు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గడించారు. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈసందర్భంగా ప్రత్యేక స్టోరీ..

Written by - Alla Swamy | Last Updated : Jul 24, 2022, 12:38 PM IST
  • ఇవాళ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు
  • టీఆర్ఎస్‌లో టాప్‌ లీడర్‌గా పేరు
  • తదుపరి సీఎం అంటూ ప్రచారం
Minister Ktr: ఇవాళ యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ పుట్టిన రోజు..ప్రత్యేక కథనం..!

Minister Ktr: సిద్దిపేటలో 1976 జూలై 24న సీఎం కేసీఆర్, శోభ దంపతులకు కేటీఆర్ జన్మించారు. బారుచ్ కాలేజీ, జార్జ్ గ్లామర్ స్కూల్లో విద్యభ్యాసం పూర్తి చేశారు. నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. సావిత్రిబాయి పులె పూణె విశ్వ విద్యాలయంలో ఉన్నత చదువులు అభ్యసించారు. 2003లో షైలిమతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల తారక రామరావు. ఆయన తండ్రి కేసీఆర్ టీడీపీలో ఉన్న సమయంలో ఎన్టీఆర్‌పై అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నారని ప్రచారం ఉంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కేటీఆర్ పేరు వినికిడిలోకి వచ్చింది. అప్పటివరకు విదేశాల్లో ఉన్న కేసీఆర్ తనయుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావించింది. 

ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలిచారు. కేసీఆర్ తొలి కేబినెట్‌లోనే మంత్రిగా అవకాశం దక్కింది. మున్పిపల్, ఐటీ శాఖను చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు టీఆర్ఎస్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడి నిలుస్తున్నారు. సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకుంటున్నారని..కేటీఆర్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

ఐతే దానిని సీఎం కేసీఆర్ స్వయంగా ఖండించారు. తానే సీఎంగా ఉంటానని ఆ పార్టీ నేతల సమావేశంలో స్పష్టం చేశారు. ఇప్పటికీ పార్టీలోగానీ, ప్రభుత్వంలో గానీ కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో నిలుస్తున్నారు. ఈఏడాది పుట్టిన రోజు వేడుకలకు మంత్రి కేటీఆర్ దూరంగా ఉన్నారు. ఆయన కాలికి గాయమైంది. మూడువారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రగతి భవన్‌లో కాలు జారి కింద పడినట్లు తెలుస్తోంది.

Also read:Corona Updates in India: దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదా..కలవర పెడుతున్న రోజువారి కేసులు..!

Also read:Lal Darwaza Bonalu LIVE* Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News