Minister Harish Rao: ఏపీ నుంచి రూ.495 కోట్లు ఇప్పించండి.. కేంద్రమంత్రికి హరీష్ రావు లేఖ

Harish Rao Letter to Union Minister Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. ఏపీ నుంచి రూ.495 కోట్లు  ఇప్పించాలని లేఖలో కోరారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని పేర్కొన్నారు. అనేక సార్లు లేఖ రాసినా.. ఇప్పటివరకు స్పందన లేదన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 12:06 PM IST
  • ఏపీకి పొరపాటు సీఎస్ఎస్ నిధులు జమ
  • ఇప్పటికే అనేక సార్లు లేఖలు రాసినా స్పందన లేదు
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ
Minister Harish Rao: ఏపీ నుంచి రూ.495 కోట్లు  ఇప్పించండి.. కేంద్రమంత్రికి హరీష్ రావు లేఖ

Harish Rao Letter to Union Minister Nirmala Sitharaman: ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన రూ.495 కోట్లు  ఇప్పించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. 2014-15లో సెంట్ర‌ల్లీ స్పాన్స‌ర్డ్ స్కీం (సీఎస్ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ.495 కోట్లు పొరబాటున ఏపీకి జమ చేశారని.. వాటిని తిరిగి ఇప్పించాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాశారు. 

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014-15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయినా పొరపాటున మొత్తం సీఎస్ఎస్ నిధులను  ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని గుర్తు చేశారు హరీష్ రావు. దీంతో తెలంగాణ నష్ట పోయిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని  కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లిందని చెప్పారు. 8 సంవత్సరాలు గడుస్తున్నా.. రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. 

ఈ విషయంపై అనేక సార్లు కేంద్రానికి ఉత్తరాలు రాశామని మంత్రి చెప్పారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌కు పొరబాటున విడుదల చేసిన రూ.495 కోట్ల మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేఖలో విన్నవించారు.

Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..

Also Read: India vs New Zealand: వరల్డ్‌కప్‌లో నేడు కీలక పోరు.. న్యూజిలాండ్‌తో టీమిండియా ఢీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News