Telangana Jana Samithi is Going to Merge with aam Aadmi Party?: ఆప్‌లో టీజేఎస్ విలీనం కాబోతోందా..? ఆ దిశగా అడుగు పడుతున్నాయా..? ఇటీవల తెలంగాణ జనసమితి నేతల రహస్య భేటీ దేనికి సంకేతం..? విలీనంపై కోదండరాం ఏమంటున్నారు..? నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు..? తెలంగాణలో ఆప్ తిష్ట వేసేందుకు తొలి అడుగు పడిందా..? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
ఇటీవల తెలంగాణ జనసమతి నేతలు రహస్య సమావేశమైయ్యారు. విలీనంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం పరిధిలోని రావిరాల ఫామ్ హౌస్‌లో ఈ భేటీ సాగింది. సమావేశంలో
కోదండరామ్‌తోపాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. గతంలోనే బీజేపీ, కాంగ్రెస్‌లో టీజేఎస్‌ను విలీనం చేయాలన్న చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆప్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ నేలతో కోదండరాం మంతనాలు జరిపారు. సమావేశంలో చాలా మంది నేతలు ఆప్‌వైపే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. టీజేఎస్ అధినేత కోదండరాం మాత్రం మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుందామని నేతలతో ఆయన చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పంజాబ్‌లో విజయం సాధించిన తర్వాత ఆప్ దూకుడు పెంచింది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని యోచిస్తోంది. ఇందులోభాగంగానే త్వరలో తెలంగాణలో ఆ పార్టీ పాదయాత్రలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తెలంగాణలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈక్రమంలోనే టీజేఎస్ నేతలతో ఆప్ నాయకులు సమంతనాలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ హాఫ్ సెంచరీ.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు!
Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook