హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నేపథ్యంలో ఇప్పట్లో కాలేజీలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఇంటర్మీడియెట్ సిలబస్‌ను 30 శాతం తగ్గించినట్టు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే ఈ మార్పులు వర్తిస్తాయని బోర్డు స్పష్టంచేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇంటర్మీడియెట్ బోర్డు ( TS inter board ) చేసిన ఈ ప్రతిపాదనకు ఇటీవలే తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ( Telangana govt ) నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో తాజా మార్పుచేర్పుల ప్రకారం తొలగించిన 30% పాఠ్యాంశాల వివరాలను ఇంటర్ బోర్డు వెల్లడించింది. సీబీఎస్ఈ ( CBSE inter syllabus ) ఏ తరహా పాఠ్యాంశాలను ఐతే తొలగించిందో.. అదే తరహాలో అవే పాఠ్యాంశాలను ఇక్కడ కూడా తొలిగించామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. Also read : Jagga Reddy thanks KTR: మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు: జగ్గారెడ్డి
కొవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో ఇప్పట్లో విద్యా సంస్థలు పునఃప్రారంభించి యధావిధిగా తరగతులు చెప్పే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ప్రైవేటు కాలేజీలు ఆన్‌లైన్ తరగతులు ( Online classes ) నిర్వహిస్తున్నప్పటికీ.. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య జరుగుతున్న ఆన్‌లైన్ తరగతులతో మొత్తం సిలబస్‌ని పూర్తి చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇక ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరో రకంగా ఉంది. ఈ కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు చెబుతున్నారు.
టిఎస్ ఇంటర్ ( TS intermediate board ) బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంటర్ మొదటి సంవత్సరం ( TS inter first year ), ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ( TS inter second year ) విద్యార్థులకు సిలబస్ భారం 30 శాతం తగ్గనుంది. Also read : Malkajgiri ACP Narasimha Reddy: మల్కాజిగిరి ఏసీపీ నర్సింహా రెడ్డి నివాసంలో ACB సోదాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe