Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే విద్యార్థులు తమ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల అవుతాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియన్ ఏప్రిల్ 20 తర్వాత మాత్రమే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
Telangana EAMCET Options: తెలంగాణలో ఎంసెట్ ఆప్షన్ల నమోదుపై ఈసారి కూడా విద్యార్థులకు చివరి క్షణం వరకు సస్పెన్స్ తప్పడం లేదు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచే ఆప్షన్ల ప్రక్రియ, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. ఆప్షన్ల నమోదులో స్పష్టత లేకపోవడంతో ఆ ప్రక్రియలో ఇంకా ముందడుగు పడలేదు.
Telangana Inter Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 25లోపు రావాల్సిన రిజల్ట్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అధికార వర్గాల నుంచి కొత్త న్యూస్ వైరల్‌గా మారింది.
Telangana Inter Board: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏడాది నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్ అమలు కానుందని స్పష్టం చేసింది. మరోవైపు ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నేపథ్యంలో ఇప్పట్లో కాలేజీలు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ఇంటర్మీడియెట్ సిలబస్‌ను 30 శాతం తగ్గించినట్టు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇంటర్మీడియెట్ బోర్డు ( TS inter board ) చేసిన ఈ ప్రతిపాదనకు ఇటీవలే తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది.
కోవిడ్ 19 ( Covid19 ) సంక్రమణ ఆ విద్యార్ధులకు వరంగా మారింది. కరోనా పుణ్యమా అని ఎటువంటి పరీక్షల్లేకుండానే పాస్ అయిపోయారు. తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇంటర్ రెండో సంవత్సరం ఫెయిలైన విద్యార్ధులంతా ఇకపై పాస్ అయిపోయారు.
ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు స్పష్టంచేశారు.
ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు, విమర్శలు ఇంకా సద్దుమణగకముందే తాజాగా వరంగల్‌లో చోటుచేసుకున్న మరో ఘటన ఇంటర్ బోర్డుని మరోసారి విమర్శలపాలుచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.