Telangana High Court: తెలంగాణ ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఎన్నికలకు ఎందుకు వెళ్లారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 29, 2021, 02:47 PM IST
Telangana High Court: తెలంగాణ ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఎన్నికలకు ఎందుకు వెళ్లారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court) అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు విలువైనవా అని వ్యాఖ్యానించింది. యుద్ధం వచ్చినా..ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం (Telangana government) ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ(SEC) తెలిపింది. మరి ఫిబ్రవరిలో కోవిడ్ రెండో దశ మొదలైతే..ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ( Election Notification) ఎందుకిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల వాయిదాకు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం మీకు లేదా అని ఎస్‌ఈసీని ప్రశ్నించింది. ఎస్‌ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదని భావించిన హైకోర్టు..ఎన్నికల సంఘం అధికారులు విచారణకు రావాలని ఆదేశించింది.

Also read: Telangana Corona Updates: తెలంగాణలో ఒక్కరోజులో 8 వేల కరోనా కేసులు, తాజాగా 58 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News