Telangana Quota MLCs: తెలంగాణలో గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారంలో అనూహ్య మలుపు తిరిగింది. ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రమాణస్వీకారం చేయొవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ ఇద్దరితో ప్రమాణం చేయించవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఇదే కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రకటించిన తమ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడంపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
మంత్రిమండలి తీర్మానం చేసి పంపిన పేర్లను తిరస్కరించడంపై ఉన్నత న్యాయస్థానంలో శ్రవణ్, సత్యనారాయణ సవాల్ చేశారు. మంత్రిమండలి నిర్ణయాలను తిరస్కరించడం సరికాదని హైకోర్టులో గుర్తుచేశారు. ఈ కేసు హైకోర్టులో ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయడం.. ఆ వెంటనే గవర్నర్ ఆమోదం చేయడంతో శ్రవణ్, సత్యనారాయణ తప్పుబట్టారు. వారిద్దరూ ప్రమాణస్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు విన్నవించారు.
కాగా హైకోర్టులో ఈ కేసు విషయమై వాదోపవాదనలు జరుగుతున్నాయి. వారిద్దరి వాదనలపై గవర్నర్ కార్యదర్శి తరఫు న్యాయవాది బదులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని న్యాయస్థానానికి విన్నవించారు. దీనివలన ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా నియమితులైన వారిపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం స్టేటస్ కో విధించింది. ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయించింది.
మండలిలో అవమానం
ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, సత్యనారాయణ ప్రమాణం చేసేందుకు శాసనమండలికి రాగా వారికి పరాభవం ఎదురైంది. అనారోగ్యంతో ఈనెల 25వ తేదీ నుంచి అందుబాటులో లేనని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 30వ తేదీన ప్రమాణస్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోదండ రాం విన్నవించారు. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడకముందే హైకోర్టులో ఈ పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో వారిద్దరూ 14 రోజుల వరకు ప్రమాణస్వీకారం కోసం వేచి ఉండాల్సి ఉంది.
Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి