భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 28,380కి చేరగా ఇప్పటివరకు 886 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇక ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,913గా ఉంది. భారత్ లో కరోనా సోకి నయమైన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు సైతం తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రోడ్లపైకి వచ్చే వారిని అడ్డుకోవడం కోసం.. వారిలో కరోనాపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
తెలంగాణలో శుక్రవారం 13 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరింది ఆయన అన్నారు.
తెలంగాణలో గురువారం కొత్తగా మరో 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నేడు గుర్తించిన పాజిటివ్ కేసులలో 13 కేసులు జిహెచ్ఎంసి పరిధిలోనే ఉన్నాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 970 కి చేరింది.
కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులలో డాక్టర్ల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందనడానికి అద్దంపట్టేలా ఉంది ఈ వీడియో. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న యువ లేడీ డాక్టర్ అంబిక తన వ్యక్తిగత అనుభవాన్ని, ప్రస్తుతం తాను గురవుతున్న మనోవేధనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్, పంచాయతీ కార్మికులు అలాగే జీహెచ్ఎంసి, హెచ్ఎండబ్లూఎస్ విభాగాల సిబ్బందికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ రూపాల్లో గుడ్ న్యూస్ అందించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మందిని డిశ్చార్జ్ చేశామని.. మరో 11 మంది చనిపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రస్తుతానికి 308 మంది బాధితులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను కంట్రోల్ చేయడం కోసం 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది.
కరోనా వైరస్ కారణంగా గత 13 రోజులుగా యావత్ భారత్ లాక్డౌన్లో ఉంది. కరోనా వైరస్‌ని నివారించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధానాన్నే సరైన మార్గంగా ఎంచుకున్నాయి. భారత్ సైతం మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ విధించడమే కాకుండా పకడ్బందీగా అమల్యయేలా చూస్తోంది. అయినప్పటికీ గత వారం రోజుల్లో భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగానే పెరిగాయి.
కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తుండటంపై ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆందోళన వ్యక్తంచేస్తూ లాక్ డౌన్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. ఆ తర్వాత కూడా కరోనావైరస్ కోవిడ్ హాట్ స్పాట్స్‌లో లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.