Discounts on Challans: బంపర్ ఆఫర్‌కు టైమ్ లేదు..మూడ్రోజులే మిగిలుంది. లేదంటే జేబులు గుల్లే

Discounts on Challans: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ ఇది. ఇంకా కేవలం మూడ్రోజులే గడువు మిగిలింది. ఆలోగా పని పూర్తి చేసేయండి. లేకపోతే మీ జేబులు గుల్లవుతాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2022, 11:06 AM IST
  • తెలంగాణలో వాహనదారుల చలాన్ల క్లియరెన్స్‌కు గడువు మరో మూడ్రోజులే
  • ఏప్రిల్ 15 తరువాత చలాన్లపై డిస్కౌంట్ వర్తించదు
  • మరోసారి గడువు పెంచే అవకాశం లేదంటున్న పోలీసులు
Discounts on Challans: బంపర్ ఆఫర్‌కు టైమ్ లేదు..మూడ్రోజులే మిగిలుంది. లేదంటే జేబులు గుల్లే

Discounts on Challans: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ ఇది. ఇంకా కేవలం మూడ్రోజులే గడువు మిగిలింది. ఆలోగా పని పూర్తి చేసేయండి. లేకపోతే మీ జేబులు గుల్లవుతాయి. 

తెలంగాణలో వాహదారులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ముగియబోతోంది. మరో మూడ్రోజులు మాత్రమే సమయం మిగిలింది. వాహనాలపై పడిన చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, ఆర్టీసీ డ్రైవర్లకు 70 శాతం, ఫోర్ వీలర్స్‌కు 50 శాతం, తోపుడు బండ్లకు 80 శాతం, మాస్క్ ధరించనివారికి 90 శాతం మాఫీ చేస్తూ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ డిస్కౌంట్ వర్తించాలంటే ఏప్రిల్ 15 లోగా పెండింగ్ చలాన్లు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

వాస్తవానికి ఈ గడువు మార్చ్ 31తో ముగిసిపోవల్సింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరో పదిహేను రోజులు గడువు పొడిగించారు. ప్రభుత్వం ఆఫర్ ఇవ్వడంతో పెండింగ్ చలాన్ల నుంచి స్పందన భారీగానే కన్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 2.40 కోట్ల వరకూ చలాన్లు చెల్లించారని సమాచారం. నగదులో చూసుకుంటే..250 కోట్ల రూపాయలు వసూలైందనని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 52 శాతం వాహనదారులు ఈ ఆఫర్ ఉపయోగించుకున్నారు. కేవలం 26 రోజుల్లో మూడు కమీషనరేట్ల పరిధిలో కోటిన్నరకు పైగా చలాన్లు క్లియర్ అయ్యాయి. 150 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. 

పెండింగ్ చలాన్లు డిస్కౌంట్‌తో చెల్లించేందుకు మరో మూడ్రోజులు మాత్రమే గడువుంది. ఆ తరువాత అయితే పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఉదాహరణకు మాస్క్ ధరించనివారు వంద రూపాయలకు బదులు వేయి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. చలాన్లను ఆన్‌లైన్‌లో కూడా చెల్లించే సౌకర్యం ఉంది. అదే సమయంలో మరోసారి గడువు పెంచకపోతారా అని ఎదురుచూసేవాళ్లు కూడా లేకపోలేదు. 

Also read: CM KCR: కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్... 24 గంటల డెడ్‌ లైన్.. స్పందించకపోతే భూకంపమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News