Telangana High Court: తెలంగాణలో లాక్డౌన్ అమలు కానుందా..తెలంగాణ హైకోర్టు ఏం ఆదేశించనుంది..రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించింది. మరి హైకోర్టు నిర్ణయమేంటనేది ఆసక్తిగా మారింది.
తెలంగాణ (Telangana) లో కరోనా పరిస్థితులపై హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు మీరు చర్యలు చేపడతారా లేదా మేం ఆదేశించాలా అని కోర్టు వ్యాఖ్యానించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.హైకోర్టు ( High Court) ఆదేశాలకు అనుగుణంగా నైట్‌కర్ప్యూ (Night Curfew) విధించింది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ రాష్ట్రంలో 23.55 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు ( Covid19 Tests) నిర్వహించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్ ( RTPCR), 19.16 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలున్నాయి. ఈ 25 రోజుల్లో కరోనా కారణంగా 341 మంది మరణించారని..రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు అత్యల్పంగా 3.5 శాతముందని ప్రభుత్వం నివేదించింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఇంకా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది.
మరోవైపు కరోనా కట్టడికై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్లైన్లో జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు కోవిడ్ నిబంధలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. మద్యం దుకాణాల్ని ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారని పేర్కొంది. రాష్ట్రానికి 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్( Oxygen supply)ను కేంద్రం కేటాయించిందని..వివిధ ప్రాంతాల్నించి ఆక్సిజన్ రప్పిస్తున్నామని నివేదికలో వెల్లడించింది.రెమ్‌డెసివిర్ సరఫరా పర్యవేక్షణ కోసం ప్రీతి మీనాను నోడల్ అధికారిగా నియమించినట్టు హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రత్యేక విచారణ చేపట్టిన హైకోర్టు..ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. నివేదికను పూర్తిగా పరిశీలించి...ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేయనుంది హైకోర్టు. లాక్డౌన్ ( Lockdown) విధించమని హైకోర్టు ఆదేశిస్తే..మే 1 లేదా 2 తేదీల్నించి తెలంగాణలో లాక్డౌన్ అమలు కావచ్చని తెలుస్తోంది.
Also read: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 10 వేలు పైగా కరోనా కేసులు, భారీగా కరోనా మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook