Telangana Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా ఇంజనీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త అందింది. 16 వందల 63 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు అయ్యాయి. ఇందులో ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో 15 వందల 22 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. ఇప్పటివరకు 46 వేల 998 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరయ్యాయి. త్వరలో మరిన్ని పోస్టులకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది.
ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖల్లో ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్(అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్)లో 1238 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్(ఆర్ అండ్ బి, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ ఆర్ యూబీఎస్,హెచ్‌వోడీ)లో 284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. వీటితోపాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ హెచ్‌వోడీలో 53, డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్(హెచ్‌వోడీ)లో 88 ఉద్యోగాల భర్తీకి అనమతులు వచ్చాయి. ఈమేరకు ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది.
మొత్తంగా ఇప్పటివరకు 46 వేల 998 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు అయ్యాయి. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు రానున్నాయి. ఇందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పోలీస్, ఫారెస్ట్, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది.
Also read:Chandrababu Naidu: పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయండి..ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ..!
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు..రాగల 48 గంటల్లో అక్కడే భారీ వర్షాలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook