coronavirus cases: హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజులతో పోల్చితే.. వేయికి తక్కువగా కేసులు నమోదు కావడం కొంత ఊరట కలిగిస్తోంది. ఈ మేరకు తెలంగాణ కరోనా కేసుల హెల్త్ బులెటిన్‌ను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 67,660కి పెరిగింది. అంతేకాకుండా నిన్న కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 551 మంది మృతిచెందారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1019 మంది కోలుకున్నారు. Also read: ఆన్‌లైన్ క్లాసులు అర్థంకాక విద్యార్థి ఆత్మహత్య
ప్రస్తుతం తెలంగాణలో 18,500 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 48,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలాఉంటే.. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీలో 273, రంగారెడ్డి జిల్లాలో 73, కరీంనగర్‌లో 54, మేడ్చల్ 48, పెద్దపల్లిలో 44, నిజామాబాద్‌లో 42, సంగారెడ్డిలో 37, నాగర్‌కర్నూలులో 32 చొప్పున కేసులు నమోదయ్యాయి. Also read: Sushant case: బలవంతంగా ఐపీఎస్ అధికారి క్వారంటైన్..