Telangana Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై అభ్యతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఎలిజిబిలిటి లేకుండా కొందర్ని ఎన్నుకున్నట్లు పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు.
అక్రమంగా నియామకం చేశారని అడగడంతో దాడి చేశారని పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన లీడర్లే ప్రాధాన్యత ఇస్తున్నరంటూ రచ్చ మొదలైంది. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ కాంగ్రెస్ లో లేట్ గా వచ్చినా.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు పార్టీ నేతలను సమన్వయం చేసుకొని తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
రేవంత్ రెడ్డి రాకతో అప్పటి వరకు ఉన్న కొంత మంది తెలుగు దేశం నాయకులు .. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి దగ్గర చాలా మంది గతంలో ఆయనతో తెలుగు దేశం పార్టీలో పనిచేసిన వారే ఉన్నారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి సరైన అవకాశాలు రావడం లేదని హార్డ్ కోర్ కాంగ్రెస్ అభిమానులు వాపోతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ప్యారాష్యూట్ లీడర్స్ కే ప్రాధాన్యత దక్కుతుందనే విమర్శలున్నాయి. ఇప్పటికే ఈ విషయమై సీనియర్ కాంగ్రెస్ లీడర్ వి.హనుమంత రావు అపుడపుడు మీడియా ముందుకు వచ్చి తన గళం వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ లీడర్స్ పదవి పంపకాల విషయంలో సీనియాటినీ పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడంతో ఒక్కసారిగా పాత, కొత్త నేతలు బాహా బాహాకి దిగి రచ్చ కెక్కారు. ఈ ఇష్యూని కాంగ్రెస్ హై కమాండ్ ఏ విధంగా సాల్వ్ చేస్తుందనేది చూడాలి.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.