Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (టీపీసీసీ చీఫ్), ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా (Revanth Reddy tested positive) వెల్లడించారు. జ్వరం, సల్ప కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు చెప్పారు.
రేవంత్ రెడ్డికి కరోనా సోకడం ఇది రెండో సారి కావడం గమనార్హం. గత ఏడాది మార్చిలోను ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పుడు కూడా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టగా.. పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితులన నడుమ ఆయన పార్టీ శ్రేణుల్లో పలువురిని కలిశారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆయన్ను కలిశారు.
ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
దేశంలో కొవిడ్ విజృంభణ..
దేశంలో మళ్లీ కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. రెండు డోసుల టీకా తీసకున్న వారికీ కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: Fire accident: కేపీహెచ్బీలో భారీ అగ్నిప్రమాదం- పూర్తిగా కాలిపోయిన థియేటర్!
Also read: Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు- మొత్తం @ 84
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook