Telangana New Secretariat Open today: ఆధునికత, సంప్రదాయం, సాంకేతికతల్ని పూర్తిగా వినియోగించుకుంటూ నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం ఇవాళ జరగనుంది. పండితులు నిర్ణయించిన ముహూర్త వేళ సచివాలయం ఓపెన్ కానుంది.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేలా నిర్మించిన తెలంగాణ నూతన సెక్రటేరియట్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట నామకరణం పొందింది. రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త సెక్రటేరియట్ హుస్సేన్ సాగర్ తీరాన రాజసం ప్రదర్శిస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్‌ను ఇవాళ మద్యాహ్నం 1.20 గంటల నుంచి 1.32 గంటల మద్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ముందుగా మద్యాహ్నం నిర్ణీత ముహూర్తానికి కాస్సేపు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు చేరుకుంటారు. ఇతర మంత్రులు, అధికారులు ఆయనను అనుసరించనున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతారు. యాగశాలలో పూజల అనంతరం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా కొత్త సెక్రటేరియట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం బ్యాటరీ వాహనంలో దిగువ అంతస్థులోని సమావేశమందిరానికి వెళ్లి వాస్తుపూజ చేస్తారు. ఆ తరువాత నేరుగా 6వ అంతస్థులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటారు. సీఎం ఛాంబర్‌లో పూజలు చేసిన కుర్చీలో ఆశీనులై..ప్రజా సంక్షేమానికి చెందిన కీలకమైన సంతకం చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమం ఓ 15 నిమిషాలుంటుంది. అదే సమయంలో ఇతర మంత్రులు, అధికారులు కూడా తమ తమ శాఖల్లో కూర్చుంటారు.
ఇవాళ మద్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల వరకు అధికారులు తమ తమ కార్యాలయాల్లో ఆశీనులై కొన్ని కీలక డాక్యుమెంట్లపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. మొత్తం కార్యక్రమం గంటలోగా పూర్తి కానుంది.
Also read: Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన అంశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook