MLA Chennamaneni Ramesh Babu: వివాదాస్పద ఎమ్మెల్యేకు ప్రభుత్వ సలహాదారు పదవి ?

MLA Chennamaneni Ramesh Babu: వేములవాడ ఎమ్మెల్యే డా చెన్నమనేని రమేష్ బాబుని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Written by - Pavan | Last Updated : Aug 26, 2023, 06:31 AM IST
MLA Chennamaneni Ramesh Babu: వివాదాస్పద ఎమ్మెల్యేకు ప్రభుత్వ సలహాదారు పదవి ?

MLA Chennamaneni Ramesh Babu: వేములవాడ ఎమ్మెల్యే డా చెన్నమనేని రమేష్ బాబుని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వృత్తిరీత్యా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్ కూడా అయిన వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబు కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో ఐదేళ్ల కాలం పాటు కొనసాగనున్నారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనున్నది.

డా. చెన్నమనేని రమేశ్ బాబు, జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక ‘హంబోల్ట్ యూనివర్శిటీ’ నుంచి  (Humboldt University Of Berlin)  అగ్రికల్చర్ ఎకనామిక్స్ అంశంపై పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టాను పొందారు. రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న నేపథ్యంలో రిసెర్చ్ స్కాలర్ గా ప్రొఫెసర్ గా డా చెన్నమనేని రమేష్ బాబుకి అగ్రికల్చర్ ఎకానమిపై ఉన్న అపారమైన అనుభవం, విజ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధి కోసం వినియోగించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ, అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి : Mars Group Investments in Telangana: తెలంగాణకి మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన మార్స్ గ్రూప్

డా చెన్నమనేని రమేష్ బాబు జర్మని పౌరసత్వం వివాదంతో పాటు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ వంటి అంశాలు ఆయన్ని ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిని చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎప్పుడూ ఇండియాలో కంటే జర్మనీలోనే అధికంగా ఉంటూ నియోజకవర్గ ప్రజలకు సైతం అందుబాటులో ఉండటం లేదని పలుసార్లు నియోజకవర్గం ప్రజలు ప్లకార్డులతో నిరసనలకు దిగిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలావుండగానే ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో చెన్నమనేని రమేష్ బాబుకు సీటు ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజాగా ప్రభుత్వ సలహాదారు పదవి కూడా ఇవ్వడానికి సిద్ధపడటం చర్చనియాంశమైంది.

ఇది కూడా చదవండి : MLC Kavitha: మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ అభ్యర్థి ఎవరు..?: ఎమ్మెల్సీ కవిత సవాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News