CM KCR: వలసలను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా? విపక్షాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా?

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందా? పార్టీ మారేవారిని ఆయన లైట్ తీసుకుంటున్నారా? లేక పార్టీలో ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్లు వెళ్లిపోవచ్చని పక్కపార్టీలవైపు చూస్తున్న నేతలకు ఇన్ డైరెక్టుగా హింట్ ఇస్తున్నారా? ఈ చర్చే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Written by - Naveen | Last Updated : Jul 12, 2022, 05:54 PM IST
  • తెలంగాణ జోరుగా నేతల వలసలు
  • అధికార పార్టీకి షాకిస్తున్న లీడర్లు
  • వలసలను లైట్ తీసుకుంటున్న కేసీఆర్?
CM KCR: వలసలను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా? విపక్షాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా?

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందా? పార్టీ మారేవారిని ఆయన లైట్ తీసుకుంటున్నారా? లేక పార్టీలో ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్లు వెళ్లిపోవచ్చని పక్కపార్టీలవైపు చూస్తున్న నేతలకు ఇన్ డైరెక్టుగా హింట్ ఇస్తున్నారా? ఈ చర్చే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో వలసలపై స్పందించారు సీఎం కేసీఆర్. గుప్పెడు మంది పార్టీ వీడినంత మాత్రాన నష్టమేం లేదని, వారికంటే బలమైన నేతలు వస్తారని కామెంట్ చేశారు. తాను పార్టీ పెట్టినప్పుడు కొంతమంది నేతలే ఉన్నారన్నారు. తర్వాత కాలంలో ఎంతో మంది నేతలను తయారు చేశామని చెప్పారు. పార్టీల్లో జంపింగ్ జపాంగ్ లు సాధారణమేనంటూ గులాబీ బాస్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి.

తెలంగాణలో ప్రస్తుతం వలసలపర్వం కొనసాగుతోంది. అధికార పార్టీ నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. రోజూ ఎవరో ఒక లీడర్ కారు దిగి.. ఇతర పార్టీలో జాయిన్ అవుతున్నారు. అధికారపార్టీ నేతలను పార్టీలో చేర్చుకొని గులాబీ దళానికి ప్రత్యామ్యాయం తామే అని చూపించుకోవాలనే కసితో బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాలు పక్క యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీ లు గులాబీ పార్టీలోని అసంతృప్త నేతలపై ఫోకస్ చేశాయి. రెండు విపక్ష పార్టీలు కూడా చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కమిటీలను  ఏర్పాటు చేశాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడుతున్న కాంగ్రెస్ పార్టీ.. సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షతన చేరికల కమిటీ వేసింది.

కాంగ్రెస్, బీజేపీ చేరిక కమిటీలు అధికార పార్టీలోని అసమ్మతి నేతలను గుర్తించి వల వేస్తున్నాయి. దీంతో కొన్ని రోజులుగా ఆ పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. గతంలో బీజేపీలోకి ఎక్కువ చేరికలు జరగగా.. కొన్ని రోజులుగా కాంగ్రెస్ లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లెల ఓదెలు, అయన సతీమణి ప్రస్తుత జడ్పీ పర్సన్  కాంగ్రెస్ గూటికి చేరారు. గ్రేటర్ టీఆరెస్ కార్పొరేటర్ విజయారెడ్డి హస్తానికి జై కొట్టింది. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎర్ర శేఖర్ రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిపోయారు. బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహ్మరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు  చెందిన మాజీ మంత్రులు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

వలసల విషయంలో కాంగ్రెస్ దూకుడు పెంచడంతో బీజేపీ అప్రమత్తమైంది. ఈటలకు చేరికల కమిటి నియమించింది.హైకమాండ్ డైరెక్షన్ లో ఈటల రంగంలోకి దిగారు. దీంతో త్వరలోనే కమలం పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక ఉన్న నేతలతో పాటు పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్న నేతలతో ఈటల మాట్లాడుతున్నారని చెబుతున్నారు. చేరికల ఆపరేషన్ మొత్తం ఈటల రహస్యంగా నిర్వహిస్తున్నారని.. జాయిన్ అయ్యేవరకు వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారని చెబుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకుని షాకిచ్చింది టీఆర్ఎస్. ఇందుకు కౌంటర్ గా 12 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లకు కమలం పార్టీ గాలం వేసిందనే ప్రచారం సాగుతోంది.

విపక్షాలు చేరికల విషయంలో సీరియస్ వర్క్ చేస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రెస్‌ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి.అయితే వలసల విషయంలో కేసీఆర్ ప్రకటన వ్యూహాత్మకంగా ఉందనే టాక్ వస్తోంది.
రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ నేతలు భారీగా జంప్ అయ్యే అవకాశం ఉండటంతో  కేసీఆర్ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. చేరికలు కామన్ అన్నట్లుగా క్రియేట్ చేసి.. వలసలను చిన్న విషయంగా చిత్రీకరించే ప్రయత్నం కేసీఆర్ చేశారని అంటున్నారు. పార్టీ నుంచి ఎంతమంది పోయినా తమకు నష్టం లేదన్నట్లుగా ముందే ప్రకటన చేసి వలసలపై చర్చ లేకుండా కేసీఆర్ చూస్తున్నారని అంటున్నారు.

Read also: Hyderabad Rains: హైదరాబాద్‌కు మరోమారు భారీ వర్ష సూచన..అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ..!

Read also: AP Flood: తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండలా ప్రాజెక్ట్‌లు..ప్రమాద హెచ్చరికలు జారీ..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News