/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇవాళ కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కీలకాంశాలపై చర్చించారు.

ఢిల్లీ పర్యటన ( Delhi visit )లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ( Telangana cm kcr ) ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( pm Narendra modi )ని కలిశారు. కీలకాంశాలపై ప్రధాని మోదీతో కేసీఆర్ చర్చించారు. వరద సహాయం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఇప్పటికే..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Central minister Amit shah ), పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ( Heavy rains ) హైదరాబాద్ తీవ్రంగా దెబ్బతిందని..జాతీయ విపత్తు నిధి నుంచి సహాయం అందించాలని కేసీఆర్..అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకు స్థలం కేటాయించినందుకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకు కృతజ్ఞతలు తెలిపారు. గృహ నిర్మాణం, పౌర విమానయాన రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులపై కేసీఆర్ ( kcr ) ఆయనతో చర్చించారు. పట్టణాభివృద్ధి నిధులు, వరంగల్, సిద్ధిపేట విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు కేసీఆర్. Also read: RGUKT CET Result 2020: త్రిబుల్ ఐటీ ఫలితాలు విడుదల..రిజల్ట్ చెక్ చేసుకోవడం ఇలా

Section: 
English Title: 
Telangana cm kcr meets pm narendra modi in delhi, discussed on state issues
News Source: 
Home Title: 

Telangana: ఢిల్లీలో కేసీఆర్ బిజి బిజీ..ప్రధాని మోదీని కలిసిన కేసీఆర్

Telangana: ఢిల్లీలో కేసీఆర్ బిజి బిజీ..ప్రధాని మోదీని కలిసిన కేసీఆర్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Telangana: ఢిల్లీలో కేసీఆర్ బిజి బిజీ..ప్రధాని మోదీని కలిసిన కేసీఆర్
Publish Later: 
No
Publish At: 
Saturday, December 12, 2020 - 20:32
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
46