CM Kcr: టీఆర్ఎస్‌నే బీఆర్ఎస్‌గా మారుస్తున్నారా..? సీఎం కేసీఆర్ మదిలో ఏముంది..?

CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ జోరు పెంచారు. దసరా పండుగ రోజున పార్టీని స్థాపించబోతున్నారు. ఈమేరకు పక్కగా సమాచారం అందుతోంది.

Written by - Alla Swamy | Last Updated : Oct 2, 2022, 06:42 PM IST
  • జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ జోరు
  • దసరా రోజున పార్టీ స్థాపన
  • నేతలతో కీలక మంతనాలు
CM Kcr: టీఆర్ఎస్‌నే బీఆర్ఎస్‌గా మారుస్తున్నారా..? సీఎం కేసీఆర్ మదిలో ఏముంది..?

CM Kcr: జాతీయ పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. దసరా పండుగ రోజు పార్టీ పేరు ప్రకటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రులు, సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పార్టీ ఏర్పాటుపై సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 5న మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. 

అదే రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతోపాటు జిల్లాలవారిగా నేతలు రానున్నారు. సమావేశంలోనే ముందుగా పార్టీ పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్‌ పార్టీనే పేరు మార్చబోతున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌ మార్చబోతున్నారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్రీయ సమితి మార్చనున్నారు. పార్టీ పేరు మార్పుపై పార్టీ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దసరా రోజు మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం సీఎం కేసీఆర్ ..మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. అందులో జాతీయ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. 

ప్రస్తుతం ఉన్న పార్టీని జాతీయ స్థాయిలో కొనసాగిస్తే వచ్చే సాంకేతిక చిక్కులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీడీపీని జాతీయ పార్టీగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అలాగే సీఎం కేసీఆర్..టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ను జాతీయ స్థాయిలో కొనసాగిస్తే పార్టీ జెండా, ఎన్నికల గుర్తుకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న దానిపై సీఎం కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు.

జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించిన తర్వాత మిగతా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయాలు, తీర్మానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలుస్తోంది. దసరా రోజున వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని సమాచారం అందుతోంది. మరోవైపు డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. 

Also read:Congress President Election: పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యం..శశిథరూర్‌కు మల్లికార్జున ఖర్గే కౌంటర్..!

Also read:CM Jagan: మరోమారు పెద్ద మనసు చాటిన ఏపీ సీఎం జగన్..చిన్నారి వైద్యానికి కోటి సాయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News