ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని కలుసుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. హైకోర్టు విభజన అంశంతో పాటు పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన హామీలు అమలు చేయాలని కేసీఆర్ కోరినట్టు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అంశాలకు సంబంధించిన వినతపత్నాని ప్రధాని మోడీకి అందించారు. కేసీఆర్ తన వినతిపత్రంలో మొత్తంగా 16 అంశాలను ప్రస్తవించినట్లు తెలిసింది. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు:
* విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం రూ. 450 కోట్లు గ్రాంట్స్
* ఏపీ పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ప్రక్రియ పూర్తి చేయాలి
* ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద నిధుల విడుదల చేయాలని ప్రతిపాదన
* ప్రతిపాదిత, పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తి చేయాలని వినతి
* కరీంనగర్ జిల్లా లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు
* రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు
* హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఏర్పాటు
* కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి చొరవ చూపాలని వినతి
* సచివాలయం, రహదారి నిర్మాణ పనులకు బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ
* ఆదిలాబాద్ సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు చర్యలు
* కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
* ప్రతి జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
* వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైట్ పార్క్ అభివృద్ధికి నిధుల విడుదల
* నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) కోసం నిధుల విడుదల
* ఎస్సీ వర్గీకరణ బిల్లు తయారు చేయాలని వినతి
* వరంగల్ లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు