Dharani Portal: ఇకనుంచి ధరణిలో రిజిస్ట్రేషన్లు.. 10 నిమిషాల్లో పని పూర్తి

Telangana CM KCR launches Dharani Portal | రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ ఆఫీస్‌లో నేటి మధ్యాహ్నాం 12:30 గంటలకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Last Updated : Oct 29, 2020, 02:29 PM IST
  • తెలంగాణలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
  • వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ధరణిలోనే చేయాలి
  • నవంబర్ 2 నుంచి ధరణి పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Dharani Portal: ఇకనుంచి ధరణిలో రిజిస్ట్రేషన్లు.. 10 నిమిషాల్లో పని పూర్తి

రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం తెలిసిందే. నేటి నుంచి తెలంగాణ (Telangana)లో రిజిస్ట్రేషన్ల విధానం మారనుంది. ధరణి పోర్టల్‌ (Dharani Portal)ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నేటి మధ్యాహ్నాం 12:30 గంటలకు సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నవంబర్ 2 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. తద్వారా తెలంగాణలోని సాగు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇక సులభతరం కానుంది.

 

ధరణి పోర్టల్ పనితీరు, వినియోగంపై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు ఇదివరకే అధికారులు శిక్షణ కూడా ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తరువాత స్లాట్ సమయానికి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే కేవలం 10 నిమిషాలలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరిగిపోతుంది. గతంలో తరహాలో పేజీలకు పేజీల డాక్యుమెంట్లు, పత్రాలకు బదులుగా పనులు వేగవంతం కానున్నాయి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తూ భూమి యజమానుల వివరాలు కనిపించేలా ధరణి వెబ్‌సైట్‌ను రూపొందించారు.

 

తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విజయదశమి నాడు ధరణి పోర్టల్ ప్రారంభించాల్సి ఉంది. అయితే పూర్తిస్తాయిలో చెక్ చేయడానికి కాస్త వాయిదా వేశారు. నేడు ధరణి పోర్టల్ ప్రారంభించిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగసభ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News